బొమ్మరిల్లు , నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సిద్దార్థ్, ఆ తర్వాత వరుస ప్లాప్ చిత్రాలతో కనిపించకుండా పోయాడు. సిద్ధార్థ్ మళ్లీ తెర మీద కనిపించనున్నాడు.. హారర్ మూవీ చంద్రకళకు సీక్వెల్‌గా వచ్చిన కళావతి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో హిట్ కాలేదు. దీనితో అతని కేరీర్‌లో కొంత గ్యాప్ ఏర్పడింది.. తాజాగా `గృహం’ అనే హారర్ సినిమాతో మరల ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.. ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో చేస్తున్నారు.. తమిళంలో `అవళ్..`గా హిందీలో `ద హౌస్ నెక్స్ట్ డోర్..`గా టైటిళ్లు పెట్టారు.. ఈ సినిమా మేకింగ్ మొత్తం హాలీవుడ్ రేంజ్ లో ఉంది.. సిద్ధార్థ్ లుక్ కూడా డిఫరెంట్‌గా కనిపిస్తోంది.
అయితే ఇప్పుడు ఈ సినిమాలో లిప్ లాక్ సీన్స్ పై హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. ఈ మూవీలో హీరోయిన్ ఆండ్రియా చేసిన లిప్ లాక్ సన్నివేశాలపై మీడియా కామెంట్స్ చేయగా వాటిపై స్పందించింది ఆండ్రియా. సినిమాల్లో లిప్‌కిస్సుల పట్ల ఆశ్చర్యపోవద్దు.. అందులో ఏమీ విచిత్రం లేదు.. అని తేల్చి చెబుతోంది ఈ హీరోయిన్. అంతటితో ఆగక..‘లిప్ లాక్స్ అంటే అవి సినిమాల్లోనే ఉంటాయా? మీరెప్పుడూ లిప్ లాక్ కిస్ పెట్టుకోలేదా?’ అంటూ సభ్యసమాజానికి పెద్ద ప్రశ్ననే వేసింది ఆండ్రియా.
లిప్ కిస్సుల విషయంలో ఆండ్రియా చాలా ఫేమస్. ఇప్పటి వరకూ చాలా సినిమాల్లో అలాంటి సీన్లలో ఈమె నటించింది. అలాగే రియల్ లైఫ్ లో కూడా సంగీత దర్శకుడు అనిరుధ్ ను అలా కిస్ చేసి.. ఈమె ఫొటోలు దిగింది. అవి కాస్తా వెబ్ లోకి లీక్ అయ్యి రచ్చ రేపాయి. అయితే ఆండ్రియా అలాంటి వాటిని లెక్క చేయడం లేదు. ఆ తర్వాత వివిధ సినిమాల్లో ఈమె లిప్ కిస్ సీన్లలో నటిస్తూ వస్తోంది. నవంబర్ లో ఈ సినిమా విడుదల కానుంది.. ఈ చిత్రానికి మిలింద్ దర్శకుడు కాగా సురేష్, అతుల్ కులకర్ణి ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.