సినీ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా. మే 4న(రేపు) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆరెంజ్ ఫ్లాప్‌తో సినీ నిర్మాణం వైపు దృష్టి సారించని నాగబాబు మళ్లీ ఈ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నా పేరు సూర్య పై నెగెటివ్ పబ్లిసిటీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని…రివ్యూలు సైతం నెగటివ్‌గా రాసేందుకు ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన నా పేరు సూర్య హిట్‌ని ఆపలేరని వెల్లడించారు.
ఇక రివ్యూలను అసలు పట్టించుకోనని…రివ్యూ అనేది రాసే వ్యక్తి అభిప్రాయం తప్ప…కోట్ల మంది రిప్రజంటేషన్ కాదన్నారు. సినిమా బాగాలేదు,యావరేజ్‌గా ఉందని చెప్పిన రికార్డు బ్రేక్‌లు చేసిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. రంగస్థలం సినిమాపై కూడా కొంత మంది బ్యాడ్ రివ్యూస్, యావరేజ్ రివ్యూలు రాశారు. కానీ ఆ చిత్రం నాన్ బాహుబలి రికార్డులన్నీ బ్రేక్ చేసిందని గుర్తుచేశారు.
ఒక సినిమా వచ్చిందంటే జనాలకు అది బావుందా? లేదా? అనేది తెలుస్తుంది. వారు మనలాగా ఎనలైజ్ చేయలేక పోవచ్చు. మనలాగా అండర్ స్టాండ్ చేసుకోలేక పోవచ్చు. కానీ కొన్ని సినిమాల మీద విపరీతమైన క్రేజ్ ఉంటుంది… ప్రేక్షకులే రియల్ జడ్జిలు అని తెలిపారు.