- Advertisement -
కరోనాపై పోరులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్లు,సంస్థలు, బహిరంగ ప్రదేశాలు, కార్యాయాల వద్ద పాన్,గుట్కా ఉమ్మివేయడం నేరమని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కోవిడ్ 19 ప్రభలుతున్న నేపథ్యంలో పరిశుభ్రత పాటించడం తప్పనిసరని…ప్రజలు అనారోగ్యకరమైన అలవాట్లను మానుకోవాలని సూచించింది. ప్రజారోగ్యం, భద్రత దృష్ట్యా పాన్,గుట్కా,పొగాకు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నిషేధమని తెలిపింది.
తుమ్ము, తుంపరలు, ఉమ్మి, తెమడ వల్ల కరోనా వ్యాపిస్తుండటం.. ఒక వ్యక్తి ద్వారా నెలలో ఈ వైరస్ 406 మందికి వ్యాప్తి చెందుతుందని ఐసీఎంఆర్ సర్వేలో తేలడంతో.. సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
- Advertisement -