కావేటీ సమ్మయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

183
cm kcr

అనారోగ్య కారణాలతో మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఇవాళ మృతి చెందిన సంగతి తెలిసిందే.ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్. పార్టీకి ఆయన అందించిన సేవలను గుర్తుచేసిన సీఎం…సమ్మయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సమ్మయ్య మృతిపట్ల మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఉద్యమసమయంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

2009,2010 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున విజయం సాధించారు కావేటి సమ్మయ్య. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ కాగజ్‌నగర్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.