తెలంగాణ పోలీసులకు సెల్యూట్: మహేష్

225
mahesh babu

కరోనాను నియంత్రించేందుకు నిరంతరం కష్టపడుతున్న తెలంగాణ పోలీసులకు సెల్యూట్ చెప్పారు హీరో మహేష్ బాబు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన మహేష్..క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.

మనకోసం నిర్విరామంగా పనిచేస్తున్న పోలీసుల సేవలు అసాధారణమైనవి. క్లిష్ట పరిస్థితుల్లో మన కుటుంబసభ్యుల జీవితాలను కాపాడుతున్నందుకు వారికి నా కృతజ్ఞతలు అంటూ ప్రశంసలు గుప్పించిన మహేష్…పోలీసుల నిస్వార్ధమైన అంకితభావానికి సెల్యూట్ చేస్తున్నానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.