పచ్చి ఉల్లి తింటే ప్రమాదమా?

51
- Advertisement -

ఉల్లిపాయ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. వంటింట్లో ఎక్కువగా ఉపయోగించే వాటిలో ఉల్లి మొదటి స్థానంలో ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి వంటకం అయిన వాటితయారీలో కచ్చితంగా ఉల్లి ఉండాల్సిందే. ఇక పాయను తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని పెద్దలు చెబుతూ ఉంటారు. అందులో ఎంతమాత్రం సందేహం లేదు. ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేయడంతో పాటు శరీరానికి సమృద్దిగా పోషకాలు అందించడంలో ఉల్లి ఎంతగానో ఉపయోగ పడుతుంది. ఇందులో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, సెలీనియం,ఫైబర్, సల్ఫర్ వంటి వాటితో పాటు విటమిన్ బి6, విటమిన్ సి, వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి..

ఉల్లిపాయ తినడం వల్ల శరీర కండరాలు బలపడడంతో పాటు జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి. కాగా ఉల్లిపాయను ఎక్కువగా కూరల్లో ఉపయోగించడంతో పాటు పచ్చిగా కూడా తింటూ ఉంటారు. ముఖ్యంగా బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్, మజ్జిగ.. వంటి వాటితో పచ్చి ఉల్లిపాయను తీసుకుంటూ ఉంటారు. అయితే పచ్చి ఉల్లి తినడం మంచిదేనా ? అంటే ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఉల్లిలో సల్ఫర్ ఉంటుంది. అందువల్ల వీటిని పచ్చిగా ఎక్కువగా తినడంవల్ల ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉందట.

Also Read:గం గం గణేశా..సెన్సార్ టాక్

ఇంకా పచ్చి ఉల్లిలో సల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థలోని పేగులపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఇంకా పచ్చి ఉల్లి తినడం వల్ల నోటి దురువాసన, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా చుట్టుముడతాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పచ్చి ఉల్లిపాయలకు దూరంగా ఉండడం చాలా మంచిదట ఎందుకంటే ఇందులో ఉండే సల్మోనెల్లా బ్యాక్టీరియా కారణంగా వాంతులు, వికారం వంటి సమస్యలు వారిలో అధికమయ్యే ప్రమాదం ఉంటుంది. ఇంకా ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది ఎక్కువైతే కాలేయ వ్యవస్థ దెబ్బ తింటుంది. కాబట్టి పచ్చి ఉల్లిని తినడం సాధ్యమైనంత వరకు తగ్గించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -