TTD:భక్తులు దళారులను నమ్మొద్దు

4
- Advertisement -

శ్రీవాణి దర్శన టికెట్లపై అపోహలు వద్దు అని కోరారు టీటీడీ అధికారులు. భక్తులు దళారులను నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల బుకింగ్‌పై కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మి భక్తులు అపోహలకు గురికావద్దు అని వెల్లడించారు.

2019 మేలో ప్రారంభమైన శ్రీవాణి టికెట్ విధానంలో లోటుపాట్లను గుర్తించి, 2024 జూన్ నుంచి పారదర్శకంగా, సురక్షితంగా ఉండేలా కొత్త బుకింగ్ వ్యవస్థను అమలు చేస్తున్నాం అని వెల్లడించారు టీటీడీ అధికారులు.

ALso Read:కొబ్బరి సాగులో గుజరాత్ టాప్!

శ్రీవాణి టికెట్ బుకింగ్ సైట్‌ను హ్యాక్ చేయడం అసాధ్యం.. అయితే కొందరు దళారులు ఏఐ ఆధారిత ఆటో ఫిల్లింగ్, ఆటో కాపీయింగ్ వంటి పద్ధతులతో వేగంగా వివరాలు నమోదు చేసి టికెట్లు బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని తెలిపారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలను టీటీడీ సాంకేతిక విభాగం నిరంతరం పర్యవేక్షిస్తూ, అనుమానాస్పద ఐడీలను వెంటనే బ్లాక్ చేస్తున్నాం…అలాగే నకిలీ టికెట్లు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం అని తెలిపారు టీటీడీ అధికారులు.

- Advertisement -