కరోనాపై పోరుకు కొనసాగుతున్న విరాళాల వెల్లువ..

269
ktr minister
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కరోనా వైరస్ కట్టడి కార్యక్రమాల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి కి ఈరోజు కూడా పలువురు పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించారు. తాము ప్రకటించిన విరాళాల కు సంబంధించిన చెక్కులను తెలంగాణ పరిశ్రమలు మరియు ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు కి ప్రగతిభవన్లో అందించారు. ఈ రోజు మొత్తం గా 11 కోట్ల 83 లక్షల రూపాయల విరాళాలను, వాటి తాలూకు చెక్కులను కెటిఆర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి పలువురు అందించారు. ఈ రోజు మొత్తం 225 మంది మంత్రి కేటీఆర్ కి ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించిన చెక్కులను అందజేశారు.

CM’s Relief Fund

ఈరోజు విరాళాలు అందించిన వారి వివరాలు:

• జివికె బయో కు చెందిన సుమారు ఐదు కోట్ల రూపాయల చెక్కును ఆ కంపెనీ వైస్ చైర్మన్ సంజయ్ రెడ్డి మంత్రి కేటీఆర్ కి అందించారు
• సాగర్ సిమెంట్స్, వెల్జన్ దేనిజన్స్, రహేజా కార్పొరేట్ సర్వీసెస్ సర్వీసెస్ లిమిటెడ్ కోటి రూపాయల చొప్పున చెక్కులను అందించారు
• శ్రీ ఆదిత్య homes, తెలంగాణ స్టేట్ ఆయిల్ ఫెడరేషన్ లిమిటెడ్, హైదరాబాద్ అర్చ్ డైకోసిస్ ఎడ్యుకేషన్ సొసైటీ, కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్, తెలంగాణ స్పిన్నింగ్ అండ్ textile mills అసోసియేషన్ 50 లక్షల చొప్పున విరాళాలు అందించారు.

CM’s Relief Fund•  ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ 31 లక్షలు.
• పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొల్లేటి దామోదర్ గుప్తా, యూనిక్ ఇన్ ప్లటబుల్స్ లిమిటెడ్ , జి ఎస్ జి బిల్డర్స్, కాకతీయ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, సప్తగిరి కాంఫోర్ప్రైవేట్ లిమిటెడ్, సరళ ప్రాజెక్ట్ వర్క్స్ లిమిటెడ్, veljan hydrair లిమిటెడ్, దివ్య శక్తి పేపర్ మిల్స్ ప్రైవేట్ లిమిటెడ్,ట్రెండ్ సెట్ బిల్డర్స్, ఎలగన్స్
డేవెలపర్స్ 25 లక్షల చొప్పున విరాళాలు అందించారు.
• గ్రీన్ సిటీ ఎస్టేట్, సూర్య శంకర రెడ్డి గుండేటి, నిజాం క్లబ్ 15 లక్షల చొప్పున అందించారు.

CM’s Relief Fund• సాకేత్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ వెంకటేష్ గ్రానైట్ ప్రైవేట్ లిమిటెడ్, ధనలక్ష్మి ఐరన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, కె ఎం వి ప్రాజెక్ట్స్ లిమిటెడ్, హారిక మరియు హాసిని క్రియేషన్స్, ఏ. శ్రీనివాస్, జై రాజ్ ఇస్పాత్ లిమిటెడ్, దేవ శ్రీ ఇస్పాత్ లిమిటెడ్, హైదరాబాద్ జిమ్ ఖానా క్లబ్, నవ తేజ్ ఇన్ ఫ్రా లిమిటెడ్, ఆర్ బి వి ఆర్ రెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ, వీరమని బిస్కెట్ ప్రైవేట్ లిమిటెడ్, డాల్ఫిన్ ఫుడ్స్, సంజీవని చారిటబుల్ ట్రస్ట్ 10 లక్షల చొప్పున విరాళాలకు సంబంధించిన చెక్కులను మంత్రి కేటీఆర్ కి అందించారు.

- Advertisement -