ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ 30 లక్షల విరాళం..

266
- Advertisement -

కారోనా నియంత్రణకు ఈ రోజు ముఖ్యమంత్రి సహాయనిధికి మంత్రి కే తారకరామారావు కార్యాలయం ద్వారా పలువురు విరాళాల అందించారు.. మొత్తం 13 మంది సుమారు కోటి 15 లక్షల రూపాయల విరాళాలను ఈరోజు అందించారు. ఏస్ (ace)ఇంజనీరింగ్ అకాడమీ 30 లక్షల రూపాయల చెక్కును మంత్రి కేటీఆర్ కి అందించింది.

అలాగే పీపుల్ టెక్ ఐటీ కన్సల్టెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ 25 లక్షల రూపాయలను, చిరిపాల్ పాలీ ఫిల్మ్స్ 25 లక్షల రూపాయలను మంత్రి కేటీఆర్ కి అందించింది. 30 లక్షల చెక్ ను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసిన ఏస్ ఇంజనీరింగ్ అకాడెమీ, ఏస్ కాలేజ్ చైర్మన్, హైదరాబాద్, వై. వి. గోపాల క్రిష్ణమూర్తి.

- Advertisement -