కిమ్ జోంగ్ ఉన్‌తో ట్రంప్ భేటీ!

2
- Advertisement -

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో మరోసారి భేటీ అయ్యే అవకాశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్‌లో తన ఆసియా పర్యటన సందర్భంగా కిమ్‌తో సమావేశమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ భేటీ ఆసక్తికరంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.

ఉత్తర కొరియా నేతతో సమావేశమయ్యే ఆలోచన ఉందా అని విలేకరులు ప్రశ్నించగా.. సమావేశమయ్యే అవకాశం ఉంది. అది ఆసక్తికరంగా ఉంటుంది కదా! కిమ్‌తో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి అని ట్రంప్ సమాధానమిచ్చారు.

ట్రంప్ తన తొలి అధ్యక్ష పదవీకాలంలో కిమ్ జోంగ్ ఉన్‌తో మూడుసార్లు సమావేశమయ్యారు. 2018లో సింగపూర్‌లో, 2019లో వియత్నాంలోని హనోయ్‌లో, అదే ఏడాది ఉత్తర, దక్షిణ కొరియాల సరిహద్దులోని పన్మున్‌జోమ్‌లో వీరి భేటీలు జరిగాయి. అయితే, ఆ చర్చలతో అణ్వాయుధాల విషయంలో ఎలాంటి తుది ఒప్పందం కుదరలేదు.

నవంబర్‌లో ఆసియా పర్యటనలో భాగంగా ట్రంప్ చైనాలోని షెన్‌జెన్‌లో జరిగే ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) దేశాధినేతల సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సదస్సు నవంబర్ 18, 19 తేదీల్లో జరగనుంది. ఈ పర్యటనలో కిమ్‌తో భేటీ జరిగితే అమెరికా, ఉత్తర కొరియా మధ్య దౌత్య సంబంధాలపై మరోసారి చర్చ మొదలయ్యే అవకాశం ఉంది.

Also Read:రొమాంటిక్ కామెడీ..’మైత్రీ ఇన్ లవ్’

ఇదిలా ఉండగా, దక్షిణ కొరియాతో నిర్వహించే సంయుక్త సైనిక విన్యాసాలను గణనీయంగా తగ్గించాలని ట్రంప్ గతంలో ఆదేశించారు. ఈ విన్యాసాలకు అధిక ఖర్చవుతోందని, కిమ్‌తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. సైనిక విన్యాసాలు ఉత్తర కొరియాకు ప్రతికూల సంకేతాలను పంపుతున్నాయని కూడా అభిప్రాయపడ్డారు.అయితే ట్రంప్‌-కిమ్ భేటీపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

- Advertisement -