బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 రోజురోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. గొడవలు, వాదోపవాదాలు, నామినేషన్లతో ఇంట్లో హీట్ పెరుగుతోంది. అక్టోబర్ 12న ప్రసారమైన 34వ రోజు ఎపిసోడ్‌లో రోహిత్, త్రిగుణ్, షాలిని మధ్య వాగ్వాదాలు చోటుచేసుకోగా.. నామినేషన్ ప్రక్రియలోనూ సభ్యులు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు.
షాలిని, సుధీర్ మాట్లాడుకుంటున్న సమయంలో త్రిగుణ్ రావడంతో చిన్నపాటి చర్చ జరిగింది. మరోవైపు, వర్షిణి కోసం త్రిగుణ్ పప్పు తీసుకోవడంతో రోహిత్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. తన అనుమతి లేకుండా ఆహారం ఎలా తీసుకుంటావంటూ ప్రశ్నించాడు. ఈ గొడవను సర్దిచెప్పేందుకు కెప్టెన్ సుధీర్ ప్రయత్నించగా రోహిత్ అతడిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో త్రిగుణ్, రోహిత్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. అనంతరం త్రిగుణ్ షాలినికి క్షమాపణ చెప్పాడు.
బిగ్‌బాస్ ప్రకటించిన నామినేషన్ ప్రక్రియలో వైల్డ్‌కార్డ్ సభ్యులకు ప్రత్యేక అవకాశం లభించింది. పోటీలో గెలిచిన సభ్యులకు ఇద్దరిని నామినేట్ చేసే అధికారం దక్కింది. శివ్ ఎంపికలో రోహిత్, త్రిగుణ్ పోటీ పడగా.. రోహిత్ విజయం సాధించాడు. మొదట వంశీని, ఆ తర్వాత ఝాన్సీని నామినేట్ చేశాడు. ఈ సందర్భంగా వంశీ, ఝాన్సీ రోహిత్‌కు గట్టిగా కౌంటర్లు ఇచ్చారు. దీంతో ఇంట్లో వాతావరణం వేడెక్కింది.
మరో పోటీలో ముకేశ్ విజయం సాధించి అమన్‌ను నామినేట్ చేశాడు. ఎల్లో కార్డు, ఇతర సభ్యులతో ప్రవర్తించిన తీరు వంటి అంశాలపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం షాలినిని కూడా ముకేశ్ నామినేట్ చేశాడు. శ్వేత సైతం అమన్‌ను నామినేట్ చేసింది.
Also Read:రొమాంటిక్ కామెడీ..’మైత్రీ ఇన్ లవ్’
నీతూ ఎంపికలో షాలిని, వర్షిణి పోటీ పడగా షాలినికి నామినేషన్లు చేసే అవకాశం దక్కింది. మొదట దేబ్జానీని నామినేట్ చేస్తూ తన శరీరాకృతిపై వ్యాఖ్యలు చేసినట్లుగా ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. మరో నామినేషన్‌లో వర్షిణిని ఎంపిక చేయనున్నట్లు వెల్లడించడంతో తదుపరి ఎపిసోడ్‌పై ఆసక్తి పెరిగింది.

