సునీతా విలియమ్స్‌ జీతంపై ట్రంప్!

2
- Advertisement -

దాదాపు 9 నెలల తర్వాత వ్యోమగామి సునీతా విలియమ్స్‌ భూమికి చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉండగా సునీతా విలియమ్స్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక సుదీర్ఘకాలం అంతరిక్షంలోనే ఉండిపోయిన సునీతా, విల్మోర్‌కు అదనపు వేతనాలు ఉంటాయా..? లేదా..? అనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు.

వీరిద్దరికి ఓవర్‌టైమ్ జీతాన్ని తన సొంత డబ్బుతో చెల్లిస్తానని ప్రకటించారు. నేను చేయాల్సివస్తే.. నా జేబు నుంచి వారికి ఓవర్‌టైమ్‌ జీతం చెల్లిస్తా అంటూ సమాధానం ఇచ్చారు. వ్యోమగాములను సురక్షితంగా భూమ్మీదకు తీసుకొచ్చేందుకు సాయం చేసిన ఎలాన్‌ మస్క్‌ కు ట్రంప్‌ కృతజ్ఞతలు తెలియజేశారు.

Also Read:నీటిని పొదుపుగా వాడుకుందాం: మంత్రి పొన్నం

- Advertisement -