తన సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్యపై స్పందించారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఇది అమెరికా ప్రజలకు చీకటి రోజు అని తెలిపారు ట్రంప్. ఈ హత్య వెనుక రాడికల్ లెఫ్ట్ హస్తం ఉందని ఆరోపించారు ట్రంప్.
ఇలాంటి చర్యలు వెంటనే ఆగాలని.. ఈ హత్యలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ, దీన్ని సమర్థించే సంస్థలనూ శిక్షిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.
ఉటా వ్యాలీ వర్సిటీ ఈవెంట్లో దుండగుల కాల్పుల్లో గాయపడిన US పొలిటికల్ యాక్టివిస్ట్ ఛార్లీ కిర్క్(31) మృతిచెందారు. ఈ విషయాన్ని ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా యువత మనసుల్ని చార్లీ కంటే ఎవరూ బాగా అర్థం చేసుకోలేదు… అతన్ని నాతో పాటు అందరూ అభిమానించారు. ఇప్పుడు అతడు మనతో లేడు. ఛార్లీ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నా అని పేర్కొన్నారు. ఛార్లీకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Also Read:#DQ41..దుల్కర్‌తో పూజా!

