మేడారం పర్యటనకు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 13, 14 తేదీల్లో మేడారంలో పర్యటించనున్నారు రేవంత్. మేడారం గద్దెల ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం.
మహా జాతరలో పనులను త్వరితగతిన పూర్తి చేసే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఇప్పటికే మేడారం జాతరకు సంబంధించి సీఎం రేవంత్ రివ్యూ మీటింగ్‌లు నిర్వహించిన సంగతి తెలిసిందే.
మేడారం, బాసర ఆలయాల అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను అధికారులు వివరించగా, మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర నాటికి భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ఇప్పటికే రేవంత్ సూచించారు. మేడారం అభివృద్ధికి సంబంధించి పలు డిజైన్లను పరిశీలించిన ముఖ్యమంత్రి వంద రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు ఉండాలని అన్నారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జంపన్న వాగులో నీరు నిలిచేలా ప్రాంతాల వారిగా చెక్ డ్యామ్‌ల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ వారంలో మేడారంకు వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తానని ఇప్పటికే చెప్పారు రేవంత్.
Also Read:చిరుతో పూరి..!

