అమెరికాతో మూడు ఒప్పందాలు: మోడీ

261
modi
- Advertisement -

భారత్ – అమెరికా మైత్రీ బంధానికి ప్రభుత్వాలతో సంబంధం లేదన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఢిల్లీలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ద్వైపాక్షిక చర్చలు ముగిసిన తర్వాత మీడియాతో సంయుక్త సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ..ప్రజలు కేంద్రంగానే ఇరుదేశాల మైత్రి బంధం బలోపేతం అవుతు వస్తుందన్నారు.

21వ శతాబ్దానికి అమెరికా- భారత్ స్నేహం ముఖ్యమైందని…నమస్తే ట్రంప్ కార్యక్రమంలో చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రక్షణ,సెక్యురిటీ,ఐటీ వంటి అంశాలపై చర్చించామని భారత సైన్యం గతంలో ఎప్పుడూ లేనంత స్ధాయిలో అమెరికాతో సంయుక్త విన్యాసాలు చేపడుతోందన్నారు. ఇంధన రంగంలో సహకరించుకుంటామని…ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు సాగిస్తామన్నారు.గత 8 నెలల్లో ట్రంప్‌తో 5 సార్లు భేటీ అయ్యానని తెలిపారు.

- Advertisement -