- Advertisement -
భారత పర్యటనలో భాగంగా ప్రేమ సౌథం తాజ్ మహల్‌ని సందర్శించారు ట్రంప్ దంపతులు. కూతురు ఇవాంకతో కలిసి తాజ్ మహల్‌ని సందర్శించిన ట్రంప్..తాజ్ మహల్ ముందు ఫోటోలకు ఫోజిచ్చారు. సందర్శకుల పుస్తకంలో తమ అభిప్రాయాలను రాశారు
అంతకముందు తాజ్ మహల్ సందర్శన కోసం ఆగ్రా చేరుకున్న ట్రంప్ ఫ్యామిలీకి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంప్రదాయ నృత్యాలు, సాంస్కతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. మోడి రాక సందర్భంగా.. ఆగ్రాను, తాజ్ మహల్ పరిసరాలను సుందరంగా అలంకరించారు.
- Advertisement -