- Advertisement -
రహస్య పత్రాల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అరెస్టయ్యారు. మియామీలోని ఫెడరల్ కోర్టులో అరెస్టు చేసినట్లు సమాచారం. రహస్య పత్రాల కేసులో ట్రంప్‌పై విచారణ జరుగుతోండగా….ఫెడరల్ అధికారులకు లొంగిపోయిన తర్వాత ట్రంప్‌ను అరెస్టు చేసినట్లు అమెరికా అధికార వర్గాలు తెలిపాయి.
ట్రంప్ సహాయకుడు, సహ ప్రతివాది వాల్ట్ నౌటాను కూడా అరెస్టు చేశారు.2024 అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ పార్టీ ఫ్రంట్ అభ్యర్థి అయిన ట్రంప్ చుట్టూ ఉన్న చట్టపరమైన సమస్యలు పెరిగాయి. మొత్తం ట్రంప్ 37 నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. మన దేశ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజుల్లో ఒకటి. మనది క్షీణిస్తున్న దేశం అని ట్రంప్ పేర్కొన్నారు.
Also Read:Centre:విపత్తు నిరోధానికి రూ.8వేల కోట్ల కేటాయింపు
- Advertisement -