Trump:మళ్లీ గెలిస్తే నియంతనవుతా

19
- Advertisement -

అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ గెలిస్తే నియంత త‌ర‌హాలో పాలించ‌నున్న‌ట్లు చెప్పారు ఆ దేశ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. రెండు ల‌క్ష్యాల కోసం తాను నియంతగా మార‌నున్న‌ట్లు తెలిపిన ట్రంప్.. త‌న‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించి విచార‌ణ చేప‌డితే అప్పుడు అమెరికా స్తంభించిపోతుంద‌న్నారు.

తానేమీ యుద్ధాలు చేయ‌లేద‌ని, విదేశాల్లో ఉన్న ద‌ళాల‌ను వెన‌క్కి ర‌ప్పించాన‌ని, కానీ అధ్య‌క్షుడు జో బైడెన్ మాత్రం యుద్ధ కాంక్ష‌నే రాజ‌కీయ ఎత్తుగ‌డ‌గా వాడుకుంటున్నార‌ని ట్రంప్ ఆరోపించారు. త‌న‌ను నియంత‌గా చిత్రీక‌రిస్తూ విప‌క్షాలు ఓట్లు రాబ‌ట్టుకోవాల‌ని చూస్తున్నాయ‌ని ఆరోపించారు.

ఈ ఏడాది కూడా దేశాధ్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ ప‌డేందుకు రిప‌బ్లిక‌న్ నేత ట్రంప్ ఆస‌క్తిగా ఉన్న విష‌యం తెలిసిందే.

Also Read:KTR:చేసిన పని చెప్పుకోలేకపోయాం..అందుకే ఓటమి

- Advertisement -