నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. ఏదైనా వస్తువు కొనుక్కోవాలన్న.. బ్యాంకింగ్ లావాదేవీలు జరపాలన్న స్మార్ట్ ఫోన్ తప్పనిసరి. స్మార్ట్ ఫోన్ చేతిలో లేకపోతే రోజు గడవని పరిస్థితి. ఒకవిధంగా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ అనేది మన శరీరంలో ఒక భాగమైపోయిందంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్ ఫోన్ వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిసిన వాడక తప్పని పరిస్థితి. స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల నిద్ర లేమి, మానసిక ఒత్తిడి, ఆందోళన, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయని చాలా మందికి తెలుసు. అయితే స్మార్ట్ పోన్ ఎక్కువగా యూజ్ చేస్తే రక్త పోటు పెరిగే అవకాశం ఉందా అంటే అవుననే అంటున్నారు చైనా పరిశోదకులు.. తాజా పరిశోదనల్లో ఈ విషయం వెల్లడైందట.
మొబైల్ ను ఎక్కువగా యూజ్ చేస్తే హైపర్ టెన్షన్ కు లోనై రక్తపోటును తీవ్రతరం చేస్తుందట. రక్త పోటు పెరిగితే గుండె సంబంధిత వ్యాధులు ఏర్పడే అవకాశం ఉంది. గుండె పోటు, కార్డియాకరెస్ట్ వంటి సమస్యలు ఏర్పడి ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా మొబైల్ ను ఎక్కువసేపు చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడడం వల్ల రేడియేషన్ నేరుగా మెదడుపై ప్రభావం చూపుతుంది. తద్వారా లేని ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అని నిపుణులు చెబుతున్నారు.
Also Read: పచ్చి బఠానీలతో.. ఆరోగ్యం !
ఇంకా మొబైల్ ను రాత్రి పగలు తేడా లేకుండా చూడడం వల్ల కంటిచూపుపై అత్యంత ప్రభావం పడుతుంది. తద్వారా వేగంగా దృష్టి మందగించే ప్రమాదం ఉన్నట్లు ఎన్నో పరిశోదనల్లో తేలింది. ఇక మొబైల్ అధికంగా యూజ్ చేయడం వల్ల ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు పెరిగి అవయవాల పనితీరు కూడా దెబ్బతింటుంది. కాబట్టి మొబైల్ ను ఎక్కువసేపు యూజ్ చేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read: నెలసరి సమస్యలకు.. వీటితో చక్కటి పరిష్కారం !