పచ్చి బఠానీలతో.. ఆరోగ్యం!

97
- Advertisement -

పచ్చి బఠానీలను చాలా మంది చిరుతిండి గా ఉపయోగిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే పచ్చి బఠానీలను వంటింట్లో వివిధ రకాల కూరలలో కూడా వాడుతుంటారు. ఇవి కూరల రుచిని పెంచడంలో ఎంతగానో సహాయపడతాయి. అయితే వీటిని తరచూ మనం తింటూ ఉన్నప్పటికి.. వీటిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి మాత్రం చాలా మందికి తెలియదు. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, మరియు విటమిన్ కె వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ఇంకా సెలీనియం, జింక్, కెరోటిన్, లూటీన్ జియాక్శాంథిన్ వంటి ఖనిజాలు కూడా మెండుగా ఉంటాయి.

అందువల్ల శరీరానికి సరైన పోషకాలు అందించడంతో పాటు పలు అనారోగ్య సమస్యలను కూడా దూరం చేయడంలో పచ్చి బఠానీలు ఉపయోగపడతాయి. పచ్చి బఠానీలను తినడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. ఇవి రక్తంలోని కార్బోహైడ్రేట్లను విచ్చినం చేసి రక్తంలో షుగర్ లెవెల్స్ ను అదుపు లో ఉంచుతుంది. ఇంకా బఠానీలలో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణశక్తి మెరుగు పడుతుంది. ఇంకా శరీరంలో ఐరన్ లోపం ఉన్నవాళ్ళు పచ్చి బఠానీలను ఉదయం సాయంత్రం తినడం ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు.

 ఫలితంగా రక్తహీనత వంటి సమస్యలు దూరం అవుతాయి. పచ్చిబఠానీలలో ఉండే విటమిన్ సి కారణంగా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇంకా కంటి చూపును మెరుగు పరచడంలో పచ్చిబఠానీలలో ఉండే లూటిన్ ఎంతగానో సహాయపడుతుందట. ఇంకా వీటిలో ఉండే ఇన్ సాల్వబుల్ ఫైబర్ కారణంగా గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు కూడా దరి చేరవని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పురుషుల్లో శుక్ర కణాల సంఖ్యను పెంచడంలో పచ్చి బఠానీలు కీలక పాత్ర పోషిస్తాయట. కాబట్టి పచ్చి బఠానీలను ఉడకబెట్టి లేదా సూప్ లా తయారు చేసుకొని ప్రతిరోజూ తాగడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు సొంతం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

Also Read:బాండ్ల వివరాలను వెల్లడించాల్సిందే:సుప్రీం

- Advertisement -