Doctors Day:డాక్టర్స్‌ కమ్‌ యాక్టర్స్

10
- Advertisement -

సాదారణంగా మనం ఎవరైనా సినిమా సెలెబ్రిటీని మీరు ఏం కావాలనుకున్నారు అని అడగగానే.. నేను డాక్టర్ ని కాబోయి యాక్టర్‌ అయ్యాను అని చెబుతుంటారు. సహజంగానే డాక్టర్‌ వృత్తికి సమాజంలో ఉన్న గౌరవం ఎనలేనిదనే చెప్పాలి. కరోనా సమయంలో డాక్టర్లు చేసిన గొప్ప కృషిని యావత్‌ సమాజం గుర్తుపెట్టుకుంటుంది. ఇంత గొప్పదైన వైద్య వృత్తిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సేవలు అందించిన టాలీవుడ్‌ సెలెబ్రీలు ఉన్నారన్న విషయం చాలా మందికి తెలయదు..ఇవాళ డాక్టర్స్ డే సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది నటీనటులు వైద్య వృత్తిలో రాణిస్తూనే నటులుగా మంచి పేరు తెచ్చుకున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో డాక్టర్‌ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది డాక్టర్‌ రాజశేఖర్‌. రాజశేఖర్‌ హస్తవాసి మంచిదన్న టాక్‌ కూడా చిత్రపరిశ్రమలో ఉంది. వైద్య వృత్తిలో సేవలందిస్తూనే ఇటు చిత్ర పరిశ్రమలో నటుడిగా కొనసాగుతున్నారు రాజశేఖర్‌.

ఇక ఫిదా సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై… టాప్‌ హీరోయిన్‌ గా కొనసాగుతూ.. లేడి సూపర్‌ స్టార్‌ గా గుర్తింపు పొందిన సాయిపల్లవి కూడా వైద్య విద్యార్థి.. సాయిపల్లవి సినిమాల్లో కోట్ల రూపాయల పారితోషికం వస్తున్నా…. తను కమర్షియల్‌ సినిమాల్లో నటించడానికి ఇష్టపడదు అన్న సంగతి తెలిసిందే. సాయిపల్లవి ఇప్పటికే చాలా సినిమాలు వదులుకున్నట్లు కూడా టాక్‌ నడుస్తోంది. అయితే తను మాత్రం ఎప్పటికైనా డాక్టర్‌ అవుతానని… తాను సంపాదించినదంతా వైద్యవృత్తిలోనే ఖర్చుపెడతానంటూ సాయిపల్లవి చెబుతోందట.

దివంగత హస్య నటుడు,1000కి పైగా సినిమాల్లో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న అల్లు రామలింగయ్య సైతం వైద్యుడే. కాకపోతే ఈయన ఆయుర్వేదంలో స్పెషలిస్ట్. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క వైద్య వృత్తిని కూడా కొనసాగించారు ఆయన.

అటు మరోపక్క నటుడు రాజశేఖర్‌ కూతురు శివాని కూడా వైద్య విద్యార్థి అని చాలా మందికి తెలియదు. తండ్రి అడుగుజాడల్లోనే శివాని కూడా వైద్య వృత్తిని ఎంచుకుని మెడిసిన్‌ కోర్స్‌ చేస్తోంది. ఈ బ్యూటీ కూడా అటు సినిమాల్లో నటిస్తూనే.. ఇటు మెడిసిన్‌ కోర్స్‌ చేస్తూ.. డాక్టర్‌ అనిపించుకుంటోంది.

నివేధా థామస్‌… ఈ అమ్మడు కూడా డాక్టర్‌ అన్న సంగతి చాలా మందికి తెలియదు. సినిమాల్లో మంచి మంచి పాత్రలు ఎంపిక చేసుకుంటూ తనకంటూ క్రేజ్ ను సంపాదించుకున్న నివేదా థామస్ కూడా వైద్య విథ్యార్థే. . ఆమె కూడా డాక్టర్ కోర్సు చేస్తుంది. మరోపక్క ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టింది.ఇలా చాలా మంది నటీనటులు అటు సినిమాల్లో నటిస్తూనే.. ఇటు వైద్యవృత్తిలోనూ కొనసాగుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Also Read:లండన్‌లో “తెలంగాణ డే” వేడుకలు

- Advertisement -