నేటి రోజుల్లో ప్రతి చిన్న ఆరోగ్య సమస్యలు మెడిసిన్ తీసుకుంటూ ఉంటారు చాలా మంది. అయితే సమస్య పెద్దదైతే మెడిసిన్ తీసుకోవడం తప్పనిసరి. అలా కాకుండా చిన్న సమస్యలకు కూడా మెడిసిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడక తప్పదు. అందుకే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఆయుర్వేదం పరంగా అద్బుతంగా పని చేసే కొన్ని చిట్కాలను తెలుసుకుందాం..!
ఎండ కాలం ముగిసి వర్షాకాలం రాబోతుంది. ఇక వర్షాకాలంలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు తరచూ వేదిస్తూ ఉంటాయి. ఈ సమస్యల నుంచి విముక్తి పొందేందుకు తులసి ఆకుల రసంలో ఒక స్పూన్ తేనె కలిపి సేవిస్తే జలుబు దగ్గు వంటి సమస్యలను నుంచి బయట పడవచ్చు. ఇక చాలా మందికి అరికాళ్లలో మంటతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే ఈ మంట కారణంగా నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి సమయాల్లో గోరింటాకు గాని, నెయ్యి గాని లేదా సొరకాయ గుజ్జు గాని అరికాళ్ళకు రాస్తే.. మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.
తేనెటీగలు గాని లేదా కందిరీగలు గాని కుట్టినప్పుడు విపరీతమైన వాపుతో తీవ్రమైన మంటతో బాధపడుతుంటారు అలాంటి సమయాల్లో అవి కుట్టిన చోట ఉల్లి రసం రాస్తే వాపు తగ్గడంతో పాటు మంట కూడా తగ్గుతుంది. ఇక జలుబు కారణంగా చాలా మందికి ముక్కు దిబ్బడ లేదా ముక్కు బిగుతుగా మారడం వంటి సమస్యలు వేధిస్తాయి. అప్పుడు కొద్దిగా క్యారెట్ రసం, అలాగే నిమ్మరసం సమపాళ్లలో భోజనానికి ముందు సేవిస్తే ముక్కు సంబంధిత సమస్యలన్నీ దురమౌతాయి. ఇక పంటినిప్పి అనేది చాలా మందిని తరచూ వేధించే సమస్య.. పంటినొప్పి అధికంగా ఉన్నప్పుడూ లవంగం చప్పరించడం లేదా నమలడం చేస్తే పంటినొప్పి నుంచి విముక్తి లభిస్తుంది. ఇంకా కడుపులో నులి పురుగులు ఉన్నవాళ్ళు ప్రతిరోజూ ఉదయం రెండు వెల్లుల్లి రెబ్బలను నమలడం, ఆయాసంతో బాధపడే వారు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలుపుకొని తాగడం వంటి చిట్కాలు కూడా అద్బుతంగా పని చేస్తౌయి.
Also Read:BJP:గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుజ్జుల..