ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ పోస్తే కఠిన చర్యలు

446
Dcp Prakash Reddy
- Advertisement -

ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ పోస్తే కఠిన చర్యలు తప్పవన్నారు శంషాబాద్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి . ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ పోసే బంక్ ల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈమేరకు శంషాబాద్ డీసీపీ.. జోన్ పరిధిలోని అన్ని పెట్రోలు బంక్‌లకు నోటీసులను జారీ చేస్తున్నామన్నారు. అంతేకాకుండా ఖాళీ బాటిళ్లతో వచ్చే వారి పేరు, ఫోన్ నంబరు, వాహనం నంబర్లు పెట్రోలు బంక్ సిబ్బంది సేకరించుకోవాలన్నారు.

ఖాళి బాటిల్ లతో పెట్రోల్ బంక్ కు వచ్చే వారి ఫోన్ నంబర్లు, ఫోటోలు తీసుకోవాలని పెట్రోల్ బంక్ సిబ్బందికి సూచించారు. ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు దృష్ట్యా ఈ విషయాలను ప్రతి పెట్రోలు బంక్ సిబ్బంది, యాజమాన్యం పాటించాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -