నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్..

339
kcr delhi

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ ఢిల్లికి వెళ్లనున్నారు. హస్తిన టూర్‌లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు పలువురు కేంద్రమంత్రులతో సమావేశం కానున్నారు. రేపు ప్రధానితో భేటీ జరిగే అవకాశం ఉందని సీఎంవో వర్గాలు తెలిపాయి.

తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు సహా విభజన హామీలు, కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా, రక్షణ శాఖ భూముల కేటాయింపు వంటి అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.

తన పర్యటనలో భాగంగా కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్‌ గడ్కరీలను కలవనున్నారు సీఎం కేసీఆర్.

Telangana K Chandrasekhar Rao will take off to Delhi in a special flight. He is scheduled to meet the Prime Minister Narendra Modi and other Ministers depending on the appointments.