నల్గొండలో పూర్తిగా దగ్దమైన ట్రావెల్స్ బస్సు

408
bus

నల్గొండ సమీపంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి ఒంగోలు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు అర్ధరాత్రి దాటిన తర్వాత అద్దంకి టు నార్కెట్ పల్లి రహదారిపై నల్లగొండ జిల్లా చర్లపల్లి వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తం అయిన డ్రైవర్ ప్రయాణికులను దించారు. చూస్తుండగానే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు వున్నారు.

నిద్రనుండి తేరుకున్న ప్రయాణికులు బస్సు దిగి పరుగులు తీశారు. ప్రయాణికుల లగేజీ అంత మంటల్లో కాలిపోయాయి. ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు…..ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలను ఆర్పారు. ఒక్కసారిగా మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధం కావడంతో చుట్టుపక్కల వారు, వాహనదారులు భయబ్రాంతులకు గురయ్యారు.. కేస్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.