రాత్రి పూట ఈ కూరగాయలు తింటే..!

68
- Advertisement -

కూరగాయలు ప్రతిరోజూ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయని, అనారోగ్య సమస్యల నుంచి ఇట్టే బయటపడవచ్చని వైద్యులు, ఆరోగ్య నిపుణులు తరచూ చెబుతూనే ఉంటారు. కూరగాయలలో లెక్కకు మించిన రకాలు మనకు కనిపిస్తాయి, టమాటో, ఉల్లిపాయ, బంగాళాదుంప, పచ్చిమిర్చి, బీట్రూట్, దొండకాయ, బెండకాయ.. ఇలా చెప్పుకుంటూ పోతే కూరగాయల లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది.

ఈ కూరగాయలలో ఒకటి లేదా రెండు రకాలు ప్రతిరోజూ మనం తినే ఆహారంలో ఉపయోగిస్తూనే ఉంటాము. మాంసాహారంలో ఉండే పోషకాల కన్నా కూరగాయలలో ఉండే పోషక విలువలే ఎక్కువని మనశరీరానికి కావలసిన శక్తిని ఇస్తాయని నిపుణులు చెబుతుంటారు. కూరగాయలలో సహజంగానే కొవ్వు శాతం, కెలోరీల శాతం తక్కువగా ఉంటుంది. అందువల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం చాలా తక్కువ. కూరగాయలలో విటమిన్లు, ప్రోటీన్లు, సూక్ష్మ పోషకాలు.. ఇలా మనశరీరానికి కావలసిన అన్నీ పోషకాలు సమృద్దిగా ఉంటాయి. అందువల్లే మాంసాహారం కంటే కూడా కూరగాయలే ఎక్కువగా తినాలని నిపుణులు చెబుతుంటారు. అయితే కొన్ని రకాల కూరగాయలు రాత్రిపూట తనడం వల్ల కొన్ని సమస్యలు చుట్టుముడతాయి.

సాధారణంగా రాత్రి భోజనం చేసిన తరువాత నిద్రలోకి జరుకుంటాము. అందువల్ల శరీరం విశ్రాంతి మోడ్ లోకి వెళ్లిపోతుంది. కొన్ని కూరగాయలు రాత్రి పూట తినడం వల్ల జీవక్రియపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా క్యాబేజీ, బ్రకోలి వంటివి తింటే రాత్రి పూట అజీర్తి సమస్య తలెత్తే అవకాశం ఉంది. దాంతో నిద్రలేమికి దారితీస్తుంది. ఇక రాత్రిపూట వెల్లుల్లి, ఉల్లి ఉన్న ఆహార పదార్థాలు తింటే గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. చిలకడదుంప, బంగాళదుంప, దోసకాయ వంటి కూరగాయలు రాత్రిపూట తింటే నిద్ర లేమి సమస్య ఏర్పడుతుంది. కాబట్టి కూరగాయలు తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నప్పటికి, రాత్రిపూట కొన్ని రకాల కూరగాయలకు దూరంగా ఉండడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read:15న ధనుష్ ‘కుబేర’

- Advertisement -