థర్డ్ ఫ్రంట్ ఆలోచనతో దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ రాజేసిన సీఎం కేసీఆర్.. అందుకు అనుగుణంగా శరవేగంగా పావులు కదుపుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంవత్సరం సమయం ఉన్న నేపథ్యంలో ఈలోపే పునాదులను గట్టిగా నిర్మించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. కేసీఆర్‌తో పాటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ‘థర్డ్ ఫ్రంట్’ వ్యూహానికి తెర వెనుక కసరత్తులు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై తమిళనాడు డీఎంకే నేత స్టాలిన్ స్పందించారు. తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ఈ నెల 4వ తేదీని తనకు ఈ విషయమై ఫోన్ చేసినట్లు స్టాలిన్ వెల్లడించారు. అయితే తాము ఇప్పటికే యూపీఏలో భాగస్వామ్య పక్షంగా ఉన్నామని, ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే ఉన్న నేపథ్యంలో మూడో ఫ్రంట్‌పై హైలెవల్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేశారు.
కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి ఏర్పాటులో ‘ఎజెండా’ కీలక పాత్ర పోషించనుండటంతో కేసీఆర్ పక్కా ప్రణాళికతో అస్త్రాలు సిద్దం చేస్తున్నారు. దేశవవ్యాప్తంగా వివిధ రంగాలలో పనిచేసి రిటైర్డ్ అయిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, ఐఆర్‌ఎస్ అధికారులతో సమావేశాలు నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. వాళ్ల అనుభవాలను పరిగణలోకి తీసుకోవడం థర్డ్ ఫ్రంట్ అవసరం,లక్ష్యాలను వివరించనున్నారు.
TMC Chief Mamata Banerjee called me on March 4 for a 'Third Front'. DMK is a part of UPA already and there is one more year for general elections, so whatever decision we have to take we will discuss with the high-level committee: DMK Working President MK Stalin in Chennai pic.twitter.com/q2vuDUO3ne
— ANI (@ANI) March 6, 2018