‘విశ్వాసం’తో అజిత్‌..

281
Ajith's next with Siva titled Viswasam
- Advertisement -

కోలీవుడ్‌లో హీరో అజిత్‌కు మంచి ఫాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న విషయం తెలిసిందే. అంతేకాదు తెలుగులోనూ ఆయన అభిమానుల సంఖ్య భారీగానే ఉంటుంది. అయితే ఆయన తాజా ఒ చిత్రంలో నటించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట. అంతేకాదు అజిత్‌ నటించబోయే ఈ చిత్రానికి ‘విశ్వాసం’ అనే టైటిల్‌ కూడా ఫిక్స్‌ చేశారని సమాచారం. ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతోంది.

Ajith's next with Siva titled Viswasam

గతంలో ‘వీరమ్’ .. ‘వేదాళం’ .. ‘వివేకం’ సినిమాలతో అజిత్ కి హిట్స్ ఇచ్చిన దర్శకుడు శివ .. ‘విశ్వాసం’ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఫస్టు షెడ్యూల్‌ను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ప్లాన్ చేశారు. ఈ నెల 23వ తేదీ నుంచి షూటింగ్ మొదలుకానుంది. ఒక పాట చిత్రీకరణతో ఈ షెడ్యూల్ ను మొదలుపెట్టనున్నారు. ఆ తరువాత ఏప్రిల్ రెండవ వారం నుంచి కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

తదుపరి షెడ్యూ ల్స్ ను చెన్నై .. ముంబైలలో ప్లాన్ చేశారు. ఆల్రెడీ హ్యాట్రిక్ హిట్ కొట్టిన కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా కావడంతో, ఈ సినిమాపై అటు కోలీవుడ్‌లో ఇటు టాలీవుడ్‌లోనూ భారీ అంచనాలే వున్నాయి. ఈ మూవీకి యువన్‌ శంకర్‌రాజా సంగీతాన్ని అందించనున్నాడు.

- Advertisement -