వాక్సిన్ పైన ఎలాంటి అపోహాలు వద్దు: రమేష్ రెడ్డి

137
dme ramesh reddy
- Advertisement -

కరోనా వాక్సిన్ పైన ఎలాంటి అపోహాలు వద్దన్నారు డీఎమ్‌ఈ రమేష్ రెడ్డి. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడిన రమేష్ రెడ్డి….రేపు ఉదయం 10.30కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాక్సినేషన్‌ను ప్రారంభిస్తారని తెలిపారు. 139 సెంటర్లలో తెలంగాణ లో వాక్సినేషన్ అందిస్తున్నామని తెలిపారు.

ప్రధాని మోదీ రెండు వాక్సినేషన్ సెంటర్లలో లైవ్ ఇంట్రాక్షన్ ఉంటుందని తెలిపిన రమేష్ రెడ్డి…..గాంధీ, నార్సింగ్ ఆస్పత్రుల్లో మోదీ ఇంట్రాక్షన్ ఉంటుందన్నారు.18 ఏళ్లలోపు ఉన్నవాళ్లకు వాక్సిన్ ఇవ్వరని వెల్లడించారు. గర్భిణీ స్త్రీలకు,పాలిచ్చే తల్లులు,హిమో ఫిలియా ఉన్న వాళ్లకు కూడా వాక్సిన్ ఇవ్వరని చెప్పారు.

వాక్సిన్ రెండు డోస్ లు ఇస్తామని మొదటి డోస్ తర్వాత 28 రోజులకు మరో డోస్ ఇస్తామన్నారు. వాక్సిన్ వల్ల కొందరికి రియాక్షన్లు సాధారణంగా రావొచ్చు…రియాక్షన్ల కు ట్రీట్మెంట్ కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం అని చెప్పారు. వారం పది రోజులు హెల్త్ వర్కర్ లు వాక్సినేషన్ పూర్తి ఆవుతుంది…వాక్సిన్ వేస్తున్న ప్రతి చోట వైద్య బృందాలను అందుబాటులో ఉంచుతామన్నారు.

- Advertisement -