నాగార్జున ‘దేవ‌దాస్’ ప్రెస్ మీట్..

242
Devadas
- Advertisement -

నాగార్జున .. నాని కథానాయకులుగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దేవదాస్’. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమా, సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డాన్‌గా నాగార్జున,డాక్టర్‌గా నాని పండించిన కామెడీ అందరికీ నచ్చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా టీమ్ ప్రెస్‌ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నాగార్జునతో పాటు అశ్వనీదత్, శ్రీరామ్ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.

Devadas

ఈ సంద‌ర్భంగా చిత్ర హీరో నాగార్జున మీడియాతో మాట్లాడారు. దేవ‌దాస్ విడుద‌లైన‌పుడు ఇక్క‌డ లేను.. వారం రోజుల పాటు స‌ర‌దాగా కుటుంబంతో గ‌డిపాను. ఇక సినిమా విష‌యానికి వ‌స్తే.. తొలి వారంలో 41 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసి రెండో వారంలోకి అడుగుపెట్ట‌డం ఆనందంగా ఉంది. ఈ విషయంలో నానికి నేను థ్యాంక్స్ చెప్పాలి.. డాక్ట‌ర్ దాస్ గా అద్భుతంగా న‌టించాడు. ఇప్పుడు ఆయ‌న వెకేష‌న్ ఎంజాయ్ చేస్తున్నాడు.

ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ ఆదిత్య‌కు మంచి భ‌విష్య‌త్తు ఉంది. ఇక నిర్మాత అశ్వినీద‌త్ నేను ఆఖ‌రి పోరాటం సినిమా చేసిన‌పుడు ఎంత ప్యాష‌న్‌తో ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. అలాగే సినిమాటోగ్ర‌ఫ‌ర్ స్యామ్ ద‌త్‌కు కూడా కృతజ్ఞ‌త‌లు.. ఈ సినిమా ఇంత బాగా వ‌చ్చిందంటే ఆయ‌న కూడా ముఖ్య కార‌ణ‌మే. దేవ‌గా అత‌డు న‌న్ను చాలా బాగా చూపించాడు. హీరోయిన్లు కూడా చాలా బాగా న‌టించారు. చివ‌ర‌గా మీడియాకు కూడా చాలా కృత‌జ్ఞ‌త‌లు. అన్నారు.

- Advertisement -