డీకే ఫస్ట్..చంద్రబాబు సెకండ్!

2
- Advertisement -

కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు డీకే శివకుమార్. దీంతో ఇప్పుడు ఆయన దేశంలోనే రిచెస్ట్ సీఎంగా నిలిచారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తనకు మొత్తం రూ. 1,413.78 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు.

రూ. 1,400 కోట్లకు పైగా ఆస్తులను కలిగి ఉండటంతో, ప్రస్తుతం రూ. 931 కోట్ల ప్రకటించిన ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును శివకుమార్ అధిగమించనున్నారు.

ప్రజలు ‘డీకేఎస్’ (DKS) అని పిలుచుకునే డి.కె. శివకుమార్ ప్రకటించిన ఈ రూ. 1,413 కోట్ల ఆస్తి.. 2018లో ఆయన ప్రకటించిన రూ. 840.08 కోట్ల ఆస్తి కంటే భారీగా పెరగడం గమనార్హం. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం డీకే..కుటుంబానికి రూ. 273.42 కోట్ల విలువైన చరాస్తులు, రూ. 1,140.36 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. మొత్తం స్థిరాస్తులలో రూ. 972.65 కోట్ల విలువైన ఆస్తులు నేరుగా శివకుమార్ పేరిటే ఉన్నాయి. వీటితో పాటు తనకు సుమారు రూ. 263 కోట్ల అప్పులు ఉన్నట్లు కూడా శివకుమార్ వెల్లడించారు.

అలాగే ఆయనకు ఒక రిజిస్టర్డ్ వాహనం (టొయోటా క్వాలిస్) తో పాటు రోలెక్స్ (Rolelex), హుబ్లాట్ (Hublot) వంటి ప్రీమియం బ్రాండ్లకు చెందిన లగ్జరీ వాచీలు ఉన్నట్లు.పెద్ద మొత్తంలో బంగారం మరియు వెండి నిల్వలు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. నామినేషన్ పత్రాలను సమర్పించే సమయానికి కనకపుర ఎమ్మెల్యే అయిన ఆయనపై 19 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు కూడా అఫిడవిట్ ద్వారా తెలిసింది.

Also Read:వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా:కేటీఆర్

శివకుమార్ రాజకీయ ప్రస్థానం 1980లో ప్రారంభంలో విద్యార్థి నాయకుడిగా మొదలైంది. 1989లో ఆయన 27 ఏళ్ల వయసులో సాతనూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1994, 1999, మరియు 2004 ఎన్నికలలో కూడా ఆయన ఇదే స్థానాన్ని నిలబెట్టుకున్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఆయన కనకపుర నియోజకవర్గానికి మారారు. అక్కడ కూడా తన విజయ పరంపరను కొనసాగిస్తూ 2008, 2013, 2018 మరియు 2023 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. 2026 లో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించిన తర్వాత, శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు.

- Advertisement -