ఈ ఏడాది సైలెంట్ గా వచ్చి బిగ్గెస్ట్ హిట్ సాధించిన చిన్న సినిమాల్లో డీజే టిల్లు ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్ కి నాలుగింతల లాభాలు వచ్చాయంటే ఈ సినిమా ఏ రేంజ్ హిట్టో అంచనా వేయొచ్చు. అయితే ఈ క్రేజీ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేసుకొని ఇటివలే సెట్స్ పైకి తీసుకోచ్చేశాడు సిద్దు జొన్నలగడ్డ. టిల్లు 2 గా తెరకెక్కుతున్న ఈ సినిమా డీజే టిల్లు కి ఎగ్జాక్ట్ సీక్వెల్ కాదు , ఇంకో కథతో రాబోతుంది. కేవలం కేరెక్టర్స్ తీసుకొని చేస్తున్న సీక్వెల్ ఇది.
అయితే టిల్లు2 కి సంబంధించి సిద్దు కి పెద్ద చిక్కే వచ్చి పడింది. ఈ సినిమాకి హీరోయిన్ సెట్ అవ్వడం లేదు. ఆ మధ్య అనుపమ పరమేశ్వరన్ ని హీరోయిన్ గా తీసుకొని కొన్ని సీన్స్ షూట్ చేశారు. కానీ అనుపమ ఈ ప్రాజెక్ట్ నుండి సడెన్ గా తప్పుకుంది. లోలోపల ఏం జరిగిందో తెలియదు కానీ అనుపమ అవుట్ అనే న్యూస్ బయటికొచ్చేసింది.
ప్రస్తుతం హీరోయిన్ గా సెబాస్టియన్ , కేతిక శర్మ , మీనాక్షి చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురిలో ఓ హీరోయిన్ ని ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు. డీజే టి ల్లు లో నేహా శెట్టి హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు సీక్వెల్ లో ఆ మేజిక్ రిపీట్ చేసే హీరోయిన్ ను పెట్టుకోవాలి. లేదంటే తేడా కొట్టడం ఖాయం. మరో వైపు ఈ సినిమాకు దర్శకుడు కూడా మారాడు. డీజే టిల్లు తీసిన విమల్ కృష్ణ కాకుండా మల్లిక్ అనే దర్శకుడితో సిద్దు ఈ సీక్వెల్ చేస్తున్నాడు. ఏదేమైనా సిద్దు కి ఈ సీక్వెల్ పెద్ద చిక్కే తెచ్చిపెడుతుంది. ఒకవైపు కంటెంట్ చూసుకుంటూ మరో వైపు హీరోయిన్ సెలెక్షన్ లో బిజీ గా ఉన్నాడు సిద్దు.
ఇవి కూడా చదవండి..