రేసుగుర్రం,సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా, `గబ్బర్ సింగ్` వంటి ఇండస్ట్రీ హిట్ ను అందించిన డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు నిర్మాతగా రూపొందుతున్న చిత్రం డి.జె..దువ్వాడ జగన్నాథమ్.
ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. ఈ బ్యానర్ రూపొందుతున్న 25వ సినిమా ఇది. అల్లు అర్జున్‌తో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న హ్యాట్రిక్ చిత్రానికి `గబ్బర్ సింగ్` వంటి ఇండస్ట్రీ హిట్‌ను అందించిన హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటు ప్రేక్షకులు, అభిమానులే కాదు, ఇండస్ట్రీ వర్గాలు సైతం సినిమా ఎలా ఉంటుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యాన్సులు ఏ రేంజ్ లో ఇరగదీస్తాడో చెప్పాల్సిన పని లేదు. యాక్షన్ లో దుమ్ము దులిపేసి డ్యాన్స్ లు అదరగొట్టేసే సరికి సరైనోడు లాంటి యావరేజ్ స్టోరీ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టయిపోయింది. గంగోత్రి, ఆర్య సినిమాల్లో కూడా ఇంతవరకు ఏ సినిమాలోనూ బన్నీ డ్యాన్స్ విషయంలో ఫ్యాన్స్ ను నిరాశ పరచలేదు. అతడి డ్యాన్స్ కు అన్ని వర్గాల్లోనూ అభిమానులు ఉన్నారు. అందుకే బన్నీ సినిమాల్లో పాటల విషయంలో డైరెక్టర్లు మరికాస్త కేర్ తీసుకోక తప్పదు.
దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో కూడా డైరెక్టర్ హరీష్ శంకర్ బాగానే ఫోకస్ చేసినట్టున్నాడు. ఈ సినిమా టీజర్ లో భాగంగా విడుదల చేసిన గుడిలో బడిలో పాట చూస్తేనే ఈ విషయం అర్ధమైపోతుంది. ఈ పాటలో హీరోయిన్ పూజా హెగ్డేతో కలిసి బన్నీ వేసిన స్టెప్పులను చూసి ఫ్యాన్స్ చిందులు వేస్తున్నారు. సినిమా ఆడియో ఈ నెల 11న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ డ్యాన్స్ ఫోజుతో ఉన్న ఫొటో రిలీజ్ చేశారు. బన్నీకి డ్యాన్స్ పట్ల ఉన్న ప్యాషన్ మొత్తం ఈ పోస్టర్ లో కనిపిస్తుంది.
దువ్వాడ జగన్నాథమ్ ఈ నెల 23న థియేటర్లకు రానున్నాడు. ఈలోగా సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ నెల 18న సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయాలని ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆలోచనలో ఉన్నాడు. అంతకన్నా ముందు 11న జరిగే ఆడియో రిలీజ్ ఫంక్షన్ కూడా గ్రాండ్ గా చేయడానికి సిద్ధమైపోయాడు. అల్లుఅర్జున్, పూజాహెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్: రవీందర్, ఫైట్స్:రామ్-లక్ష్మణ్, సినిమాటోగ్రఫీ: ఐనాక బోస్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, స్క్రీన్‌ప్లే: దీపక్ రాజ్ నిర్మాత: దిల్‌రాజు, కథ, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్.ఎస్.