2.0 ఫోటోలు లీకయ్యాయి..!

222
- Advertisement -

తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ – సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన రోబో సినిమా ఎన్నో రికార్డులు క్రియేట్ చేయ‌డంతో పాటు అటు ర‌జ‌నీ, ఇటు శంక‌ర్ వీరిద్ద‌రి కేరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. 2010లో వ‌చ్చిన ఈ సినిమాకు కంటిన్యూగా ఇప్పుడు 2.0 తెర‌కెక్కుతోంది. ఈ సినిమా ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకోగా, ప్ర‌స్తుతం సీజీ వ‌ర్క్స్ జ‌రుపుకుంటుంది. అక్టోబ‌ర్ 2017లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయాల‌ని యూనిట్ భావించిన‌ప్ప‌టికి, కొన్ని కార‌ణాల వ‌ల‌న 2018కి వాయిదా వేశారు.

Amy Jackson and Rajinikanth picture from 2.0

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి రెండు పిక్స్ లీక్ కాగా, అవి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ గొడ‌ని నెడుతున్న‌ట్టు ఉండ‌గా, మ‌రో ఫోటోలో అమీ జాక్స‌న్ హెవీ వైకిల్ ని న‌డుపుతున్న‌ట్టుగా ఉంది. ఈ పిక్స్ అంత‌గా క్లారిటీ లేక‌పోయిన‌, ఫ్యాన్స్ లో మాత్రం అంచ‌నాలు పెంచుతున్నాయి.

robo-leak1

రజనీకాంత్‌కున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని జపనీస్, చైనీస్, కొరియన్‌తో పాటు వివిధ విదేశీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏడువేల థియేటర్స్ లో విడుదల చేయాలనుకుంటున్నారు రోబో టీం. 450 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచానాలు వున్నాయి. బాహుబలి-2 రికార్డులను బ్రేక్ చేయాలనే లక్ష్యంతో చిత్ర దర్శకనిర్మాతలు పావులు కదుపుతున్నారని తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 25,2018న విడుద‌ల చేయ‌నున్నారు. అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ వారు భారీగా నిర్మిస్తుండగా, ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

- Advertisement -