‘డీజే’ ఫస్ట్ లుక్ అదుర్స్‌

322
DJ First Look
- Advertisement -

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌ తన సినిమా క్రేజ్‌కు తగ్గట్టుగా సినిమా సినిమాకు గెటప్ మారుస్తు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. సరైనోడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం డిజే. గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో డీజే.. దువ్వాడ జగన్నాథంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.అల్లు అర్జున్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వేసవిలో ముందుకు తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ సినిమా గురించి అప్పుడప్పుడూ బయటికి వస్తున్న అప్ డేట్స్ తో సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాడు బన్నీ. రెండు రోజులుగా విడుదల చేస్తున్న పోస్టర్స్‌తో డీజేపై అంచనాలు మరింత పెంచేసిన బన్నీ తాజాగా ఫస్ట్ లుక్‌తో అదరగొట్టాడు స్కూటర్‌ పై కూరగాయాలు తీసుకువస్తు అమాయకంగా కనిపిస్తున్న బన్నీ ఫస్ట్ లుక్‌ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

డీజే ప్రి లుక్ లో  రుద్రాక్ష దండ.. అడ్డ నామాలుతో అలరించిన చిత్రయూనిట్ బన్నీని ఫస్ట్ లుక్ లో పర్‌ఫెక్ట్ బ్రహ్మణ యువకుడిలా తీర్చిదిద్దారు. తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్ బన్నీ చారిగా నవ్వులు పూయించేందుకు ముందుకువస్తున్నాడు. ఇటీవల లీకైన డీజే లుక్‌లో కూడా బన్నీ పిలక పెట్టినట్లుగా దువ్విన జుట్టు.. ఒళ్లంతా విబూధి నామాలు.. పంచె కుట్టు.. కాషాయ వస్త్రం.. మెడలో యజ్ఞోపవీతం.. అబ్బో బన్నీ లుక్ అదిరిపోయిందంతే.

- Advertisement -