గ్రేటర్‌లో బతుకమ్మ చీరల పంపిణీ..వివరాలు

634
ghmc
- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభమైంది. మంత్రి కేటీఆర్ నల్గొండలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించగా వివిధ నియోజకవర్గాల్లో మంత్రులు,ఎమ్మెల్యేలు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.ఇక గ్రేటర్‌లో మంగళవారం వివిధ డివిజన్లలో బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నారు.

ఉదయం 8:30గంటలకు:రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ బోయగూడలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఉదయం 9:30గంటలకు: అమీర్ పేట్ వివేకానందనగర్ కమ్యునిటీహాల్,ఉదయం 10:30గంటలకు: రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అంబర్ పేట్ లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఉదయం 10గంటలకు: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కర్మన్ ఘాట్ సుమంగళి ఫంక్షన్ హాల్ లో పాల్గొంటారు.

ఉదయం 11గంటలకు: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎన్.టి.ఆర్ నగర్, భగత్ సింగ్ నగర్ లలో పాల్గొంటారు

ఉదయం 11గంటలకు: నగర మేయర్ బొంతు రామ్మోహన్ మల్లాపూర్ వి.ఎన్.ఆర్ ఫంక్షన్ హాల్ లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.

ఉదయం 11గంటలకు: రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మూద్ అలీ మలక్ పేట్ లోని ఆజాం ఫంక్షన్ హాల్ లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఉదయం 11గంటలకు: డిప్యూటి స్పీకర్ టి. పద్మారావు సీతాఫల్ మండిలో పాల్గొంటారు.

ఉదయం 11గంటలకు: డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ యూసుఫ్ గూడ మహంకాళి ఫంక్షన్ హాల్ లో పాల్గొంటారు.

ఉదయం 11:30గంటలకు: రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ గోషామహల్ నియోజకవర్గంలోని ఆబిడ్స్ ఫంక్షన్ హాల్ లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.

మధ్యాహ్నం 1గంటలకు: డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ బహుదూర్ గూడలో పాల్గొంటారు.

- Advertisement -