లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు ఎవరు కూడా ఆకలితో అలమటించ కూడదన్న ముఖ్యమంత్రి కెసిఆర్ సూచన మేరకు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ సహకారంతో నేడు బోరబండలో జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఆద్వర్యంలో పేద కుటుంబాలకు, వలస కూలీలకు ఇంటింటికీ వెళ్లి భోజనం ప్యాకెట్లను అందజేయడం జరిగింది.
ఈసందర్భంగా బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ ఆద్వర్యంలో వీలైనంత వరకు అన్నిరకాల ఏర్పాటు చేస్తున్నప్పటికి కూడ ఇంకా కొంతమందికి అవసరం అయిన పక్షంలో స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాల్సి వస్తుందని.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ అడిగిన వెంటనే పెద్ద మనసుతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ తరఫున భోజనం ప్యాకెట్లు ఏర్పాటు చేయించడం చాలా గొప్ప విషయం అని తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌కి బొరబండ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఎక్కడ అయితే పేద ప్రజలకు భోజనం లేక ఇబ్బంది పడుతున్నారో వారికి ఇదే విధంగా లాక్ డౌన్ పూర్తి అయ్యేవరకు అందజేయడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్, డివిజన్ నాయకులు పాల్గొన్నారు.