భారీ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘భీష్మ’..

292
nithin

నితిన్,రష్మిక మందన,వెంకీ కుడుముల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశి నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’. ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, విడుదలైన ప్రతి ప్రాంతంలోను హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన ఈ చిత్రం, ఆ తరువాత కూడా అదే జోరును కొనసాగిస్తూ వెళుతోంది.

Bheeshma

దేశ వ్యాప్తంగా 6 రోజుల్లో ఈ సినిమా 28.70 కోట్లను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, 41.30 కోట్లను రాబట్టిన ఈ సినిమా, 50 కోట్ల క్లబ్ దిశగా పరుగులు తీస్తోంది. ఇప్పటికే లాభాల బాట పట్టిన ఈ సినిమా, యూఎస్ లోను తన దూకుడు కొనసాగిస్తోంది. దగ్గరలో గట్టి పోటీనిచ్చే సినిమాలేవీ లేకపోవడం వలన, ఈ సినిమా మరిన్ని వసూళ్లు సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.