వెటర్నరీ వైద్యురాలు దిశ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నలుగురు నిందితులను ఈరోజు ఉదయం ఎన్ కౌంటర్ చేశారు పోలీసులు. నిందితుల ఎన్ కౌంటర్ పట్ల దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిశకు సరైన న్యాయం జరిగిందని చెబుతున్నారు. నిందితులను ఎన్ కౌంటర్ చేయడంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్ కీలక పాత్ర పోషించారు. దీంతో దేశ వ్యాప్తంగా సీపీ సజ్జనార్ పేరు మారుమోగుతుండంతో ఆయన హీరో అయ్యారు.
ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో సీపీ సజ్జనార్ పేరు మార్మోగుతోంది. దేశ వ్యాప్తంగా ఉన్న యువత తమ వాట్సప్ స్టేటస్ లలో సజ్జనార్ ఫోటోలు పెట్టుకుని హ్యాట్సాప్ సార్ అంటూ కామెంట్ లు పెడుతున్నారు. తాజాగా, పలు ప్రాంతాల్లో సజ్జనార్ ఫొటోకు పాలాభిషేకాలు నిర్వహించారు. సజ్జనార్ ను కీర్తిస్తూ నినాదాలు చేయడమే కాదు, ఆయన చిత్రపటానికి అభిషేకం చేస్తూ ప్రజలు తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.దిశ ఆత్మకు శాంతి చేకూరిందని ఆమె తల్లితండ్రులన్నారు.