హ్యాట్సాఫ్ టూ కేసీఆర్ః అసెంబ్లీలో సీఎం జగన్

462
Kcr Jagan
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అసెంబ్లీ సాక్షిగా అభినందించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. దిశ హత్యచార కేసు నిందితులను ఎన్ కౌంటర్ చేయడం జరగకూడని పరిస్ధితిలోనే జరిగిందని అన్నారు. ఏపీ అసెంబ్లీలో మహిళల భద్రతపై చర్చ జరిగింది. ఈసందర్భంగా పలువురు సభ్యులు తమ స్పందనను తెలియజేశారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. దిశ హత్యాచార కేసు సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన. దిశపై అత్యాచారం చేసి కాల్చేసిన ఘటన దారుణం. దిశ ఘటనను చూసిన తర్వాత ఆమె తల్లిదండ్రుల పడిన ఆవేదన చూసిన నిందితులను కాల్చేసిన పర్వాలేదనుకున్నాను. నాకు భార్య, పిల్లలు, చెల్లి ఉంది.

మన ఇంట్లో ఇలాంటి ఘటనలు జరిగితే మనం ఊరుకుంటామా? నిందితులకు ఏరకమైన శిక్ష పడితే తనకు ఉపశమనం కలుగుతుందో ఆలోచించాలి.దిశ హత్య కేసు నిందితుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ పోలీస్ లు సరైన నిర్ణయం తీసుకున్నారని హ్యాట్సాఫ్ టూ కేసీఆర్ అని పొడిగారు సీఎం జగన్. దారుణమైన పరిస్థితుల్లో చట్టాలు ఉన్నాయి. ఢిల్లీలో నిర్భయ ఘటన తర్వాత నిర్భయ చట్టం తీసుకువచ్చాం. నాలుగు నెలల్లో తీర్పు ఇచ్చి శిక్ష విధించాలని నిర్భయ చట్టం చెబుతుంది. మరి నిర్భయ కేసులో ఏడేళ్లు అవుతున్న శిక్ష అమలు కావడం లేదన్నారు. దిశ కేసు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేస్తే ఎన్‌హెచ్‌ఆర్సీ ఎందుకు వచ్చి నిలదీస్తుందని ఆయన ప్రశ్నించారు.

- Advertisement -