తెలంగాణలో పెండింగ్ చలానాలు ఉన్న వాహనదారులకు రాష్ట్ర పోలీసుశాఖ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ఈ చలాన్లలో చెల్లింపులకు భారీ రాయితీ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ ఈరోజు నుండి ప్రారంభమైంది. రెండు, మూడు చక్రాల వాహనాలకు 75%, ఆర్టీసీ డ్రైవర్లకు 70%, లైట్, హెవీ మోటారు వాహనాలకు 50%, తోపుడు బండ్లకు 75%, నో మాస్కు కేసులకు 90% రాయితీ ఇచ్చారు. ఈ చలాన్ల వెబ్‌సైట్ (https://echallan.tspolice. gov.in)లో ప్రత్యేక లింక్ మంగళవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ అవకాశం మర్చి నెలాఖరు వరకు ఉంటుందని పోలీసువర్గాలు తెలిపాయి.
ఈ వాహనాల పెండింగ్ చలాన్ డిస్కౌంట్‌కు విశేష స్పందన లభిస్తోంది. ప్రతి నిమిషానికి 700 పెండింగ్ చలాన్లను వాహనదారులు క్లియర్ చేస్తున్నారు. ఆన్‌లైన్, ఈ-చలాన్ వెబ్‌సైట్ ద్వారా పెండింగ్ చలాన్లను క్లియరెన్స్ చేస్తున్నారు. తొలి 8 గంటల్లో 1.77 లక్షల చలాన్లు చెల్లింపులు చేశారు. ఈ చలాన్ల చెల్లింపుల ద్వారా రూ. 1.77 కోట్లు జమ అయ్యాయి.