ఎంకె స్టాలిన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌

102
- Advertisement -

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా స్టాలిన్ కు ఫోన్ చేసి విషెస్‌ తెలిపారు. ఆయురారోగ్యాలతో కలకాలం సుఖ సంతోషాలతో జీవించాలని, తాను మరిన్ని విజయాలు సాధించాలని, కోరుకున్న లక్ష్యాలను స్టాలిన్ చేరుకోవాలని ఆకాంక్షించారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌కు ఎం.కె. స్టాలిన్ కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -