ప్చ్.. నిరాశలో ఎన్టీఆర్ ఫ్యాన్స్

16
- Advertisement -

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్, ప్రస్తుతం తాను నటించిన, నటిస్తున్న సినిమాలు అనుకున్న సమయానికి రిలీజ్ అవ్వక ఫాన్స్ పదే పదే డిస్పాయింట్ అవుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి అదే జరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సిన దేవర ఎట్టకేలకు దసరాకి పోస్ట్ ఫోన్ అయ్యాడు. ఇప్పడు ‘వార్ 2’ విషయంలో కూడా అదే జరుగుతుందనే అనుమానాలు సోషల్ మీడియాలో ఎక్కువవుతున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో విడుదల కావాల్సిన ‘వార్ 2’ను వచ్చే ఏడాది సమ్మర్ కి పోస్ట్ పోన్ చేస్తున్నారు.

ఇంకేంటి, ‘వార్ 2’ వచ్చే ఏడాది మే నెలలో వస్తుంది.. ఇకపై ‘వార్ 2’ షూటింగ్ అప్ డేట్స్ తో తడిచిపోవడం ఖాయమనే ఆనందంలో ఎన్టీఆర్ ఫాన్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు వచ్చే ఏడాది సమ్మర్ కి కూడా విడుదలయ్యే ఛాన్స్ లేదు, ‘వార్ 2’ లో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ ఉందట. సో.. దాని కోసం టీమ్ దాదాపు ఏడు నెలలు కష్టపడాల్సి ఉంది. కాబట్టి, బెటర్ గ్రాఫిక్స్ కోసం ‘వార్ 2’ ని పోస్ట్ పోన్ చేసినా చెయ్యొచ్చనే మాట వినిపిస్తోంది. వార్ 2 సినిమా హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతోంది. పైగా, సినిమాని చాలా భాషల్లో రిలీజ్ చేయాలి.

ఈ పాటికి, ‘వార్ 2’ షూటింగ్ స్టార్ట్ కావాలి. కానీ, ఇంకా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లోనే ఉంది. రీసెంట్ గా హృతిక్ రోషన్ పై కొన్ని సీన్స్ షూట్ చేశారు. వచ్చే నెల నుంచి ఎన్టీఆర్ కూడా ‘వార్ 2’ షూట్ లో జాయిన్ కానున్నాడు. కానీ, ఇంకా లాంగ్ షూటింగ్ కి సంబంధించిన పక్కా షెడ్యూల్స్ ఓ కొలిక్కి రాలేదు, మేకర్స్ కూడా హడావిడి మొదలు పెట్టలేదు. అందుకే, వార్ 2 రిలీజ్ మరింతగా పోస్ట్ పోన్ అవ్వొచ్చు అంటూ వస్తున్న వార్తలతో ఎన్టీఆర్ అభిమానులు డిస్పాయింట్ మోడ్ లోకి వెళ్తున్నారు.

Also Read:Congress: ఏదైనా సరే.. ఛలో డిల్లీ?

- Advertisement -