BJP:ఓటమి ఉచ్చులో ఆ ముగ్గురు!

22
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బ తిన్న బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ప్రజల దృష్టిని తమ వైపు తిప్పుకునేందుకు సంకల్ప యాత్రను కూడా చేపట్టింది. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది. అయితే ఈసారి లోక్ సభ ఎన్నికల బరిలో దిగే కొంతమంది అగ్రనేతలకు ఓటమి భయం వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. బండి, సంజయ్, కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్ గత పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచి గెలుపొందారు. కానీ బండి సంజయ్, ధర్మపురి అరవింద్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచినప్పటికి ఓటమి చవిచూశారు. ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోసం మరోసారి సిద్దమౌతున్నారు., సిట్టింగ్ లకే అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా బీజేపీ అధినాయకత్వం ప్లాన్ చేస్తుండడంతో వీరికి దాదాపుగా సీట్లు ఖాయమే అనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

అయితే గత లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన వీరికి ఈసారి మాత్రం వీరికి గెలుపు అంత ఈజీ కాదనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఎందుకంటే గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతో కొంత ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికి అదే పార్టీకి చెందిన ఈ ముగ్గురు రాష్ట్రానికి తెచ్చిందేమీ లేదనే వాదన బలంగానే వినిపిస్తోంది.

కరీంనగర్ లో బండి సంజయ్ పై ఇప్పటికే చాలానే వ్యతిరేకత కనిపిస్తోంది. అటు ధర్మపురి అరవింద్ పై కూడా అంతే స్థాయిలో వ్యతిరేకత నెలకొంది. ఇక కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా పని చేసినప్పటికి రాష్ట్రానికి నిధులను రాబట్టడంలో విఫలం అయ్యారనే వాదన వినిపిస్తోంది. ఇలా ఆయా కారణాల చేత ఈ ముగ్గురిని ఓటమి భయం వెంటాడుతునట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బ తిన్న ఈ ముగ్గురు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓడిపోతే వీరి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే అవకాశం లేకపోలేదు.

Also Read:Congress: ఏదైనా సరే.. ఛలో డిల్లీ?

- Advertisement -