దివ్యాంగులు రెండు పథకాలకు అర్హులు

77
marriages
- Advertisement -

దివ్యాంగురాలైన యువతిని పెండ్లి చేసుకుంటే కల్యాణలక్ష్మీ లేదా షాదీ ముబారక్‌ ఆర్థిక సాయాన్ని రెట్టింపు చేస్తామని దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ తెలిపారు. సకలాంగుడు దివ్యాంగురాలిని పెండ్లి చేసుకుంటే ప్రభుత్వం ఆ జంటకు రూ.ఒక లక్ష నగదు ప్రోత్సాహాన్ని ఇస్తామని తెలిపింది. కల్యాణలక్ష్మీ లేదా షాదీముబారక్‌తో పాటుగా అదనంగా రూ. లక్ష చెల్లిస్తామన్నారు.

దివ్యాంగుల పరిరక్షణ చట్టం 2016 ప్రకారం కల్యాణలక్ష్మీ లేదా షాదీముబారక్‌తో పాటుగా అదనంగా 25శాతాన్ని ఇస్తామని తెలిపింది. ఈ మేరకు మొత్తం తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగురాలుని పెండ్లి చేసుకుంటే రూ.2,22,145 సాయం కింద అందజేస్తామని తెలిపారు.

కల్యాణలక్ష్మీ లేదా షాదీముబారక్‌ పథకాల ద్వారా లబ్ధి పోందిన వారు దివ్యాంగురాలకు అందించే నగదు ప్రోత్సాహం అనర్హులని తెలంగాణలో సాగుతున్న ప్రచారాన్ని శైలజ ఖండించారు. ఇలాంటి ఆసత్య ప్రచారాలను నమ్మవద్దని పిలుపునిచ్చారు. అర్హులైన దివ్యాంగులు రెండు పథకాలకు అర్హులని తెలిపింది. ఈ మేరకు అన్ని జిల్లాల సంక్షేమ అధికారులకు మార్గదర్శకాలను జారీ చేసినట్టు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి…

నేటి బంగారం, వెండి ధరలివే

బీజేపీ నేతలు విచారణకేందుకు వస్తలేరు?

రైతు క్షేమమే బీఆర్ఎస్‌ లక్ష్యం…కేటీఆర్‌

 

- Advertisement -