సినిమా తారల ప్రేమాయణాలు కొత్తేం కాదు. దర్శకులు, హీరోలు నచ్చిన అందాల తారలతో లవ్ ఎఫైర్స్ నడిపిన సందర్భాలు సినిమా ప్రపంచంలో కోకొల్లలు. ఇలాంటి లవ్ స్టోరీ ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. సీనియర్ హీరోయిన్ భానుప్రియ, క్లాసిక్ డైరెక్టర్ వంశీ మధ్య ప్రేమాయణం నిజమేనట. స్వయంగా భానుప్రియే ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రివీల్ చేసింది. అప్పట్లో తనను పెళ్లి చేసుకుంటానని డైరెక్టర్ వంశీ ప్రపోజ్ చేశాడట. కానీ, ప్రపోజ్ కు ముందే వంశీ వివాహితుడు. దీంతో భానుప్రియ తల్లి వంశీ ప్రతిపాదనను తిరస్కరించిందట. భానుప్రియ హీరోయిన్‌గా, వంశీ ‘సితార’, ‘అన్వేషణ’, ‘ఆలాపన’ వంటి క్లాసిక్ హిట్లు తీశాడు. ఈ మూడు సినిమాల్లోనూ హీరో పాత్రలున్నా.. వంశీ కథానాయిక పాత్రనే హైలెట్ చేశాడు. దీనికి కారణం భానుప్రియ మీద వంశీకి ఉన్న ఇష్టమేనన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే అప్పట్లో ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందన్న వార్తలు వినిపించేవి. అంతేకాదు ఒక దశలో భానుప్రియపై వంశీకి ఉన్న ఇష్టం.. ఆయన కెరియర్ పై ప్రభావం చూపిందంటారు చాలామంది.
- Advertisement -
- Advertisement -