గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న దర్శకుడు విజయ్ కుమార్..

184
Director Vijay Kumar Konda
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈ రోజు సినీ దర్శకుడు విజయ్ కుమార్ కొండ మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మూడు మొక్కలు నాటానని సినీ దర్శకుడు విజయ్ కుమార్ కొండ తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లాంటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

కమెడియన్ ధన్ రాజ్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరిస్తూ గచ్చిబౌలిలో మొక్కలు నాటిన సినీ దర్శకుడు విజయ్ కుమార్ కొండ.. అనంతరం ( హీరో రాజ్ తరుణ్ , సినీ ప్రొడ్యూసర్ అనంత్ )లు కూడా మొక్కలు నాటి మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసరాలని కోరారు.

- Advertisement -