వెంకటేష్ మహా మంచి దర్శకుడే కాదు వెర్సటైల్ రైటర్ కూడా. యూత్ ఫుల్ కంటెంట్ కు కాంటెంపరరీ స్టఫ్ తో పాటు ఎమోషనల్ సోషల్ కాజ్ ను కూడా అద్దగలడు మహా. అందుకే ఇప్పుడు వెంకటేష్ మహా కి ఓ స్పెషలాఫర్ వచ్చింది. నాగచైతన్య కొత్త సినిమాకి డైలాగ్ వెర్షన్ రాయడం. చైతు హీరోగా తయారయ్యే ఈ సినిమా ఓ తమిళ సినిమా మాతృక ఆధారంగా స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నారు.
ఇప్పటికే పాపులర్ వ్యూవర్ షిప్ అందుకున్న ఈ సినిమాకు తెలుగు డైలాగ్ వెర్షన్ అందించమని వెంకటేష్ మహా ను సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ కోరినట్లు బోగట్టా. దానికి, వెంకటేష్ మహా కూడా ఓకె అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు గాను ముప్పై లక్షల రెమ్యూనరేషన్ అందుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దర్శకుడిగా వెంకటేష్ మహా పేరు, దాని వాల్యూ లెక్కల్లో చూసుకుంటే, తక్కువా ? అన్న అనుమానం కలుగుతుంది, కానీ.. ఓ రైటర్ గా డైలాగ్ వెర్షన్ కు ముప్పై లక్షలు అంటే మంచి మొత్తమే.
అయితే, వెంకటేష్ మహా కథలు చాలా టిపికల్ గా ఎమోషనల్ గా ఉంటాయి. మరి ఈ సబ్జెక్ట్ కూడా అలాంటిదే అయ్యి ఉండొచ్చు. మరి ఇలాంటి స్క్రిప్ట్ కు డైలాగ్ వెర్షన్ అంటే.. కాస్త గట్టి కసరత్తే చేయాల్సి వుంది. వెంకటేష్ మహా ఈ విషయంలో సక్సెస్ అవుతారో లేదో చూడాలి.
ఇవి కూడా చదవండి..