బ‌న్ని తో త్రివిక్ర‌మ్ హ్యాట్రిక్ కు సిద్దం..

244
allu arjun, trivikram
- Advertisement -

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ప్ర‌స్తుతం ఎన్టీఆర్ హీరోగా అర‌వింద స‌మేత వీర రాఘ‌వ సినిమా చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈసినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ నేప‌ధ్యంలో ఈక‌థ సాగ‌నుంద‌ని స‌మాచారం. ఈసినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డె న‌టించ‌గా..త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ స‌గం వ‌ర‌కూ షూటింగ్ జ‌రుపుకోగా..ద‌స‌రాకు ఈసినిమా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు ద‌ర్శ‌క‌, నిర్మాతలు.

ntr

తాజాగా వ‌స్తున్న స‌మాచారం ప్ర‌కారం త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ త‌రువాతి సినిమా అల్లు అర్జున్ తో చేయ‌నున్నాడ‌ని ఫిలిం వ‌ర్గాల స‌మాచారం. గ‌తంలో అల్లు అర్జున్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో రెండు సినిమాలు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. జులాయి, స‌న్ ఆఫ్ స‌త్య‌మూర్తి రెండు సినిమాలు మంచి విజ‌యాన్ని సాధించాయి. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కోసం ఒక క‌థ‌ను రెడీ చేసి అత‌నికి వినిపించాడ‌ని తెలుస్తుంది. క‌థ విన్న బ‌న్నీ వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ట‌. ఇక ఈసినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌నున్నాయి.

Allu-Arjun, trivikram

నాపేరు సూర్య నాఇల్లు ఇండియా సినిమా త‌ర్వాత అల్లు అర్జున్ మ‌రే సినిమాకు ఒప్పుకొలేదు. ఆ సినిమా ఘోర ప‌రాజ‌యం చెందండ‌తో నిరాశ‌లో ఉన్నాడు బ‌న్నీ. త‌న త‌ర్వాతి సినిమా కోసం ప‌క్కాగా ప్లాన్ వేసుకుంటున్నాడు. ప్ర‌స్తుతం అల్లు అర్జున్ విక్ర‌మ్ కుమార్ తో ఓ మూవీ చేయనున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్న అద ఇంత వ‌ర‌కూ పట్టాలెక్క‌లేదు. త్రివిక్ర‌మ్ సినిమా అయిపోయేస‌రికా ఇంకా టైం ఉండ‌టంతో అంతలోపు వేరే ద‌ర్శ‌కుడితో సినిమా చేసే ఆలోచ‌న‌లో ఉన్నాడు బ‌న్ని. ఇక వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో హ్యాట్రిక్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు.

- Advertisement -