త్రివిక్ర‌మ్ బ‌న్నీ మూవీలో హీరోయిన్ క‌న్ఫామ్..

288
Trivikram Allu Arjun
- Advertisement -

ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేష‌న్ సినిమా తెర‌కెక్క‌నున్న విష‌యం తెలిసిందే. న్యూ ఇయ‌ర్ రోజున బ‌న్నీ ఈవిష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్ధ వారు సంయుక్తంగా క‌లిసి ఈమూవీని నిర్మించ‌నున్నారు. త్వ‌ర‌లోనే సినిమాలో రెగ్యూల‌ర్ షూటింగ్ కూడా ప్రారంభంకానుంద‌ని స‌మాచారం. బ‌న్నీ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో ఇది మూడ‌వ సినిమా కావ‌డం విశేషం.

kyera advani

తండ్రి కొడుకుల బంధానికి సంబంధించిన ఎమోష‌న్ ఈ క‌థ‌లో ప్ర‌ధానంగా ఉండ‌నుందని టాక్. ఈమూవీలో హీరోయిన్ గా ఎవ‌రికి అవ‌కాశం వ‌స్తుంది అని ఎదురుచూస్తున్నారు ప్రేమ‌క్షులు. తాజాగా ఉన్న స‌మాచారం ప్ర‌కారం కైరా అద్వానిని ఫైన‌ల్ చేసిన‌ట్టు సినీ వర్గాల స‌మాచారం. భ‌ర‌త్ అనే నేను సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అయింది కైరా. ఈ భామ ప్ర‌స్తుతం బోయ‌పాటి రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న వినయ విధేయ రామ మూవీలో కూడా న‌టించింది.

- Advertisement -